రామ్ చరణ్, వివి వినాయిక్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుందనే సంగతి తెలిసిందే. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో సమంతను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం. యేమి మాయ చేసావే, బృందావనం చిత్రాలతో యువత హృదయాలను కొల్లగొట్టిన ఆమె ఈ మాస్ మసాలా చిత్రంలో ఎంపిక కావటంతో చాలా సంతోషంగా ఉంది. డి వి వి దానయ్య నిర్మించనున్న ఈ చిత్రం రచ్చ ఓ షెడ్యూల్ పూర్తి కాగానే ప్రారంభం అవుతుంది. ఇక ప్రస్తుంతం వినాయిక్..అల్లు అర్జున్ తో రూపొందిస్తున్న బద్రీనాధ్ చిత్రం ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నారు. అభిమానుల అంచనాలకు తగినట్టుగా ఈ చిత్రం ఉంటుందని, రామ్ చరణ్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవనున్న ఈ చిత్రం పక్కా కమర్షియల్ చిత్రంగా తెరకెక్కనుందని టెక్నీషియన్స్ అందర్నీ త్వరలో ప్రకటిస్తామ ని నిర్మాత మీడియాకు తెలియచేసారు. ఇక రామ్ చరణ్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ..వినాయక్ చెప్పిన కథ అద్భుతంగా ఉండడంతో ఈ చిత్రాన్ని చేయడానికి ఒప్పుకున్నానని, నా పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని అన్నారు. ఇక ఈ చిత్రంకు ముందే సంపత్‌నంది దర్శకత్వంలో ‘రచ్చ’ అనే చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రం ముగింపు దశలోనే ఉండగానే వినాయక్ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది
Source:something.com
No comments:
Post a Comment