BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Friday, May 27, 2011

ఒకప్పుడు చిరు సరసన ఇరగదీసిన మీనా చరణ్ అత్తగా.

Meenaనిన్నటితరం హీరోయిన్ మీనా, తెలుగు తెరపై రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆ మధ్య ‘వెంగమాంబ’ సినిమాలో నటించిన మీనా, పెళ్ళయ్యాక సినిమాలకు దూరమైన సంగతి తెల్సిందే.. సినిమాలపై సరదా తీరలేదనీ, నటనపై ఆసక్తి ఇంకా పెరిగిందనీ, అందుకే రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాననీ ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీనా చెప్పుకొచ్చింది. 

తెలుగులో ఓ యువ హీరో కి అత్తగా నటిస్తున్నానని మీనా చెప్పింది. ఆ యువ హీరో ఎవరనే విషయమై ఆరా తీస్తే, చిరంజీవి తనయుడు చరణ్ పేరు తెరపైకొచ్చింది. చరణ్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెల్సిందే. ఈ సినిమాలో అత్తగా ఓ పాజిటివ్ క్యారెక్టర్ లో మీనా నటించనుందంటూ టాలీవుడ్ సర్కిల్స్ లో గుసగుసలు విన్పిస్తున్నాయి. చిరంజీవితో హీరోయిన్ గా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన మీనా, చిరంజీవి తనయుడికి 

అత్తగా ఏ మేర తన సత్తా చాటుకుంటుందో వేచి చూడాల్సిందే



Source:something.com

No comments:

Post a Comment