తన భార్య స్నేహారెడ్డి, తను కలిసి కొన్ని యాడ్ ఫిలిమ్స్ లో నటిస్తున్నట్టు ఇటీవల కొన్ని వెబ్ సైట్స్ లో వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అల్లు అర్జున్ స్పష్టం చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి పత్రికల ఎడిటర్లకు, టీవీ చానెల్స్ ఎడిటర్లకు అల్లు అర్జున్ ఓ లెటర్ రాయడం జరిగింది. ఎటువంటి ఆధారం లేని ఇటువంటి వార్తలు తమకు మానసిక వేదనను కలిగిస్తాయని అర్జున్ ఆ లేఖలో పేర్కొన్నాడు. మీడియాతో తనకెంతో అనుబంధం ఉందనీ, ఇటువంటి వార్తల్ని ప్రచురించే ముందు, ప్రసారం చేసే ముందు తనను సంప్రదించి నిజానిజాలు తెలుసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశాడు.
Source:something.com
No comments:
Post a Comment