నాగచైతన్య రీసెంట్ హిట్ 100% లవ్ చిత్రానికి ఒక్క రూపాయి కూడా రెమ్యునేషన్ ముట్టలేదంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నిజమా ఉత్తిగా అనేది ప్రక్కన పెడితే గత రెండు రోజులుగా ఫిల్మ్ నగర్ క్లబ్ లోనూ బయిట ఇద్దరు సినిమావాళ్ళు కలిసినప్పుడు ఈ టాపిక్ గ్యారెంటీగా వస్తోంది. ఏ మాయ చేసావే వంటి హిట్టు ఇచ్చిన నాగచైతన్యకు అల్లు అరవింద్ ఇలా రూపాయ ఇవ్వకుండా వాడేసుకోవటం ఏమిటని అనుకుంటున్నారు. అయితే నాగార్జునకి ఇచ్చిన మాట ప్రకారమే నాగచైతన్య ఆ చిత్రంలో నటించాడని, ముందుగా హిట్స్ అనేవి వస్తే ఆ తర్వాత రెమ్యునేషన్స్ అనేవి చూసుకోవచ్చనే స్టాటజీతో నాగార్జునే ఇలా ఫిక్స్ చేసాడని అంటున్నారు. అల్లు అర్జున్ నో, లేక రామ్ చరణ్ తోనో కాకుండా నాగచైతన్యతో చేయాల్సిన అవసరం ఏముందు అల్లు అరవింద్ కి కాబట్టే డబ్బు ప్రసక్తి లేకుండా పనికానిచ్చేరంటున్నారు. అయితే ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ మాత్రం నాగచైతన్యకే ఇచ్చారుట. ఈ లెక్కన అయితే రెమ్యునేషన్ ముట్టినట్లే అంటున్నారు
Source:something.com
No comments:
Post a Comment