BREAKING NEWS
Wednesday, April 13, 2011
ప్రాక్టికల్‌గా పోసాని చాలా స్వీట్ పర్సన్ అంటోందామె
పోసానితో సినిమా అనేసరికి అంతా తేడా అన్నారు. కోపంగా ఉంటారని, భయపెట్టేస్తారని, ఎక్స్‌ప్రెషన్స్‌కి కష్టపెడతారని..ఏవేవో అన్నారు. బిగ్గరగా అరుస్తూ మాట్లాడినా..చూడడానికి కటువుగా ఉన్నా.. ప్రాక్టికల్‌గా చాలా స్వీట్ పర్సన్ అంటూ సర్టిఫికేట్ ఇచ్చేసింది సంజన.తన తాజా చిత్రం దుశ్సాసన త్వరలో విడుదల కానున్న సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పింది. అలాగే ఆయన ఇక్కడికి రామ్మా...అక్కడకు వెళ్లమ్మా.. అన్నంత సున్నితంగా, ప్రేమగా సన్నివేశాన్ని వివరించేవారు. సహజంగా చేసెయ్..టెన్షన్ లేకుండా అదే బాగా వస్తుంది...అని సెట్స్‌లో ప్రోత్సహించేవారు. చూసి నేర్చుకునే గుణముందని చాలాసార్లు మెచ్చుకున్నారు. నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకోవడంలో వెరీ స్పెషలిస్ట్ ఆయన అంటూ తెగ పొగిడేసింది.ఇక ‘దుశ్శాసన’ ఈనెల 21న విడుదలవుతోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment