BREAKING NEWS
Wednesday, April 13, 2011
తీన్ మార్' విషయమై ఫలించిన డిస్ట్రిబ్యూటర్ సూసైడ్ బెదిరింపు
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం తీన్ మార్ రేపు(గురువారం) విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం విషయమై సుప్రీమ్ మూవీస్ (యుస్ఎ)డిస్ట్రిబ్యూటర్స్ కీ, నిర్మాత గణేష్ బాబుకీ మధ్య వివాదం జరుగుతున్నట్లు తెలుస్తోంది. దాంతో ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఆత్మహత్యకు పాల్పడతామని బెదిరించినట్లు చెప్తున్నారు.వివరాల్లోకి వెళితే..సుప్రీమ్ మూవిస్ వారు తీన్ మార్ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని కోటి డబ్బై ఐదు లక్షలకు కొనుగోలు చేసారు. అయితే అందులో నలభై ఐదు లక్షలు బ్యాలెన్స్ ఉంది.అది చెల్లిస్తే గానీ ప్రింట్స్ పంపమని గణేష్ క్లియర్ గా చెప్పటం జరిగింది.అయితే రిలీజ్ అయ్యాక దాన్ని చెల్లిస్తామని సుప్రీమ్ వారు చెప్పారు.దాంతో గణేష్ ప్రింట్స్ ని పంపలేదు. అంతేగాక ఈ చిత్రం రైట్స్ ని ఫికాస్ గ్రూప్ వారికి ఇచ్చేసి కొత్త ఎగ్రిమెంట్ చేసుకున్నారు. వారు ఒకేసారి గణేష్ చెప్పిన మొత్తం పేమెంట్ చెల్లించేసారు.దాంతో సుప్రీమ్ వారు మండిపడుతున్నారు.తమ దగ్గర అడ్వాన్స్ తీసుకుని వేరే డిస్ట్రిబ్యూర్స్ కి ఎలా ఇస్తారని అంటున్నారు. పవన్ కళ్యాణో లేక గణేష్ దీనికి సమాధానం చెప్పాలని, ప్రింట్స్ డెలివరీ కాకపోతే తాము ఆత్మ హత్యకు పాల్పడతామని అన్నారు. దాంతో బెదిరిన గణేష్..ఫికాస్ వారితో చేసుకున్న ఎగ్రిమెంట్ కాన్సిల్ చేసుకుని వెంటనే సుప్రీమ్ వారికి ప్రింట్స్ పంపించటం జరిగిందని తెలుస్తోంది. ఈ విషయం బిజెనెస్ సర్కిల్స్ లో బాగా వినపడుతోంది. మొత్తానికి గణేష్ ఇద్దరి దగ్గరా బకరా అయ్యాడని అంటున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment