BREAKING NEWS
Wednesday, April 13, 2011
జూ ఎన్టీఆర్ మాజీ గర్ల్ ప్రెండ్ కి ఇంకా పద్దెనిమిదేళ్ళేట
నాకు ఇంకా పద్దెనిమేదేళ్లే. అప్పుడే పెళ్లంటారేంటి? అప్పుడే దానికి తొందరేం వచ్చింది అంటూ విసుక్కుంటోంది సమీరా రెడ్డి. ఎన్టీఆర్ తో అశోక చిత్రంతో చేసి ఆయన గర్ల్ ప్రెండ్ గా పేరు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత చిరంజీవి సరసన జై చిరంజీవ చిత్రంలో చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆమెను త్వరలో ఎన్టీఆర్ పెళ్ళి చేసుకుబోతున్నాడు కదా మీ పెళ్ళెప్పుడు అంటే ఇలా స్పందించింది. అలాగే.. ఇంకా సినిమాల్లో చాలా పేరు తెచ్చుకోవాలి. నా కంటూ కొన్ని డ్రీమ్ రోల్స్ ఉన్నాయి. వాటిని పూర్తి చేయాలి. ఆ తరువాతే పెళ్లి. అయినా నాకు ఆ వయసు ఇంకా రాలేదు కదా అని తేల్చి పారేసింది. అంతేగాక.. మంచి కథ దొరికితే మళ్లీ టాలీవుడ్‌లో సెకెండ్ ఇన్నింగ్ ప్రారంభిస్తా అంటోంది సమీరారెడ్డి.అలాగే తన వివాహం సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తితో కాదంటోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment