మామూలుగా ఓ సినిమా విడుదలవుతోందంటే అందులో నటించిన హీరో చాలా టెన్షన్ పడుతుంటాడు. అదే స్టార్ హీరోలైతే మరి కాస్త ఎక్కువే! ఇతర హీరోల సినిమాలతో పోల్చుకోవడం ఒకటి ఎక్కువైందీమధ్య. దాంతో, సినిమా ఫ్లాపయితే అప్ సెట్ అయి, కొంతమంది డిప్రెషన్ లోకి కూడా వెళ్ళిపోతున్నారు. తాజాగా ఈ జబ్బు కొంతమంది హీరోయిన్లకు కూడా పాకింది. ఆమధ్య ‘ఆరెంజ్’ ఫ్లాప్ జేనీలియానీ, తాజాగా ‘శక్తి’ పరాజయం ఇలియానానీ అలాగే అప్ సెట్ చేసాయి.
తమిళ, తెలుగు, భాషల్లో తిరుగులేని కథానాయికగా చలామణి అవుతున్నత్రిష ఇప్పుడు ఇదే టెన్షన్ లో ఉందంటున్నారు. ఆమె నటించిన ‘తీన్ మార్’ ఈ 14 న విడుదలవుతోంది. ఈ సినిమా హిట్ అయితే, తను మరి కొంతకాలం టాలీవుడ్ లో కొనసాగడానికి వీలవుతుందన్నది ఆమె అభిప్రాయం. అదే ఫ్లాప్ అయితే, తన కెరీర్ ఇక ఎండింగ్ కి వచ్చేసినట్టేనని త్రిష కలవరపడుతున్నట్టు తెలుస్తోంది. మరి, ఈ సినిమా త్రిషని ఏం చేస్తుందో.. వేచిచూడాల్సిందే...
No comments:
Post a Comment