BREAKING NEWS
Wednesday, April 13, 2011
చాక్లెట్ ఇస్తా అంటూ దేవిశ్రీ ప్రసాద్ నాచేత...': కలర్స్ స్వాతి
రీసెంట్ గా విడుదలైన '100% లవ్' సినిమాలోని 'ఏ స్క్వేర్...' పాటని కలర్స్ స్వాతి పాడింది. మార్కెట్లో ఈ పాట మంచి పేరు తెచ్చుకుంది.హీరోయిన్ గా అవకాశాలు కోసం ట్రై చేస్తున్న స్వాతి హఠాత్తుగా ఇలా గాయినిగా అవతారం ఎత్తటానకి కారణమేమిటా అంటే దేవిశ్రీ ప్రసాద్ అని చెప్తోంది.ఈ విషయమై మాట్లాడుతూ..ఈ సినిమాలో దేవి నాచేత బతిమాలి పాడించుకొన్నారు. 'ఒక్క లైన్ పాడు ప్లీజ్... చాక్లెట్ ఇస్తా' అని చెప్పేవారు. దాంతో సులువుగా పాడేశా'' అని చెబుతోంది స్వాతి.ఇక ఈ మ్యాటర్ పై దేవి ఏమంటున్నాడంటే...''నాకు స్వాతి ఎప్పటి నుంచో తెలుసు. అయితే తను పాటలు కూడా పాడుతుందని ఎప్పుడూ అనుకోలేదు.'100%లవ్' సినిమాలోని 'ఏ స్క్వేర్...' పాటని స్వాతితో పాడిస్తే బాగుంటుంది అనిపించింది. చాలా బాగా పాడింది. తనచేత మరిన్ని పాటలు పాడిస్తా'' అని దేవిశ్రీ ప్రసాద్ చెప్పారు.ఇంతకీ మీరు ఆ పాట విన్నారా...ఎలా ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment