BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Tuesday, April 26, 2011

'జోష్' హీరోయిన్ కార్తీక మళ్ళీ తెలుగులో ..డిటేల్స్

నాగచైతన్య సరసన హీరోయిన్ గా చేసి తెలుగు తెరకు పరిచయమైన తమిళ అమ్మాయి కార్తీక. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ కూతురైన కార్తీక ఆ తర్వాత ఆఫర్స్ ఏమీ రాక మిగిలిపోయింది.తాజాగా ఆమె తమిళంలో నటించిన ‘కో’ హిట్టైంది.దాంతో ఆ చిత్రాన్ని తెలుగులోకి ‘రంగం’టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోగా తమిళ హీరో జీవా నటించారు. ఈ చిత్రం గురించి చిత్ర నిర్మాత జీవా తండ్రి ఆర్.బి.చౌదరి మాట్లాడుతూ.. నా కుమారుడు జీవా హీరోగా నటించిన ‘కో’ తమిళంలో ఘనవిజయం సాధించింది. జీవా కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ ఇది. దర్శకుడు కె.వి.ఆనంద్‌ ‘వీడొక్కడే’తో తెలుగులో హిట్‌ కొట్టారు. ‘రంగం’ అతడికి రెండో సినిమా ఇక్కడ. మీడియా పవర్‌ ఏంటో చూపించే చిత్రమిది. సమాజంలోని దురాగతాలను, అవినీతిని బైటపెట్టే ఫోటోగ్రాఫర్‌ పాత్రలో జీవా నటించారు. రాధ తనయురాలు కార్తీక అద్భుతంగా నటించింది. మంచి వాణిజ్య విలువలున్న ఈ సినిమా తెలుగులోనూ విజయం సాధిస్తుందన్న నమ్మకముంది. ఈ నెలాఖరున లేదా మే తొలివారంలో ఇక్కడ విడుదల చేస్తాం’ అన్నారు. ఇక ఈ చిత్రంతో అయినా కార్తీకకు తెలుగులో మళ్ళీ ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.

No comments:

Post a Comment