వెండి తెరపై మరో వారసత్వం రాబోతుంది. ప్రముఖ హీరో రాజేంద్రప్రసాద్ కుమారుడు బాలాజీ త్వరలో హీరోగా పరిచయమవబోతున్నారు. డైరెక్టర్ నిధి ప్రసాద్ ఆయనను హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నారు. హీరో కం కామెడి కింగ్ గా ప్రేక్షకులను కొన్ని సంవత్సరాలుగా అలరిస్తున్న రాజేంద్రప్రసాద్ తనయుడు కావడంతో ఆయన నుంచి కూడా ప్రేక్షకులు కామెడి ఎక్స్పెక్ట్ చేస్తారు. మరి ఆయన తండ్రిలాగా కామెడి బాట పడతారో లేక యాక్షన్ హీరోగా ఆరంగేట్రం చేస్తారో లేక లవర్ బాయ్ గా యువతని అలరిస్తారో చూడాలి.
ఇంతకు ముందు కామెడి కుటుంబం నుంచి వచ్చిన బ్రహ్మానందం కొడుకు గౌతమ్, ఎమ్మెస్ నారాయణ కుమారుడు కూడా హీరోలుగా పరిచయమయ్యారు. బాబు మోహన్ కుమారుడు కూడా హీరోగా ఒక సినిమాను చేసారు. చూస్తుంటే కామెడి కుటుంబం తమ కుమారులను హీరోలుగా చేయాలని మహా పట్టుదలగా ఉన్నట్టు కనిపిస్తుంది.
No comments:
Post a Comment