పుట్టపర్తి: సత్య సాయిబాబా ఆశీస్సులతో అన్ని కార్యక్రమాలను కొనసాగిస్తామని శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు స్పష్టం చేసింది. బాబా మరణం తర్వాత ట్రస్టు తొలిసారి ట్రస్టు మంగళవారం సాయంత్రం సమావేశమైంది. సమావేశానంతరం బాబా సోదరుడి కుమారుడు, ట్రస్టు సభ్యుడు రత్నాకర్ పేర ఓ ప్రకటన విడుదల చేశారు. సత్య సాయి బాబాకు నివాళులు అర్పిస్తూ ట్రస్టు ఏకగ్రీవ తీర్మానం చేసింది. సత్య సాయి బాబు జీవించి ఉన్నంత కాలం మార్దదర్శనం చేస్తూ తమను నడిపించారని, ఇప్పుడు బాబా ఆశీస్సులతో ముందుకు సాగుతామని రత్నాకర్ చెప్పారు.
సత్య సాయిబాబా ప్రారంభించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యధావిదిగా కొనసాగుతాయని ఆయన చెప్పారు. బాబా తమపై పెట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామని అన్నారు. బాబా జీవించి ఉన్నంత వరకు ఎలా నడిపించారో అదే రీతిలో నడిపించడానికి తాము వజ్ర సంకల్పంతో ఉన్నామని చెప్పారు. ట్రస్టుపై ప్రజలకు నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఈ నెల 29వ తేదీ వరకు సత్య సాయిబాబా సమాధిని భక్తులు సందర్శించడానికి అనుమతి ఇస్తామని చెప్పారు.

No comments:
Post a Comment