ఆ తర్వాత రాజు ఇంటికి రాలేదు. అయితే 21న ఉదయం పక్కన రక్తపు మడుగులో పడి ఉన్నాడు. దీంతో ఆయనను వెంటనే మహాత్మాగాంధీ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఐదు రోజులుగా చికిత్స పొందుతున్న రాజు ఉదయం మరణించాడు. అయితే రాజు తల్లిదండ్రులు ఐదు రోజుల క్రితమే తమ ఇంటి పక్కన ఉన్న భవన యజమాని తన కొడుకును నరబలి ఇవ్వడానికి ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. కిరాణా దుకాణం నడుపుతున్న పక్కన భవనం యజమాని మూడంతస్తుల భవనాన్ని పునర్నిర్మిస్తున్నాడు. ఈ భవనం ఇంకా పూర్తి కాలేదు.
ఇప్పుడు కూడా బాలుడి తల్లిదండ్రులు, బంధువులు నరబలి జరిగిందని పక్కన ఉన్న భవన యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. రాజు నరబలికి కారణం అని అనుమానిస్తున్న ఇంటి యజమానిని, తమ్ముళ్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే తమకు నరబలి అవసరం లేదని వారు వాదిస్తున్నారు. అయితే ఈ కేసులో రాజు మరణానికి ముందు ఏమైనా చెప్పి ఉంటే ఆధారాలు దొరికేవి. కానీ రాజు నుండి ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీయనందువల్ల కేసులో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది.
No comments:
Post a Comment