హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పెళ్లి పిలుపు వచ్చింది. యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి ప్రముఖ వ్యాపారవేత్త నార్నే తనయ లక్ష్మీప్రణతితో వచ్చే నెల 5వ తారీఖున ఉన్న విషయం తెలిసిందే. శుక్రవారం జూనియర్ ఎన్టీఆర్ తన తండ్రి, తెలుగుదేశం పార్టీ రాజ్య సభ సభ్యుడు నందమూరి హరికృష్ణతో కలిసి వచ్చి ముఖ్యమంత్రికి తన పెళ్లి పత్రికను అందించారు. తన తనయుడి వివాహానికి రావాల్సిందిగా హరికృష్ణ ముఖ్యమంత్రిని కోరారు.
తన పెళ్లికి జూనియర్ ఎన్టీఆర్ తన తండ్రితో కలిసి వెళ్లి స్వయంగా అందరికీ పత్రికలను పంచుతున్నారు. ఇటీవలె తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును కలిసి ఇద్దరూ పెళ్లికి ఆహ్వానించారు. ఆ తర్వాత కేంద్రమంత్రి పురందేశ్వరిని ఆహ్వానించారు
No comments:
Post a Comment