BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Friday, April 22, 2011

పవన్ ‘తీన్ మార్’లాగే రవితేజాతో త్రిష ‘బమ్ చిక్ బమ్

Trisha-Ravi Tejaరవితేజ, త్రిష జంటగా 'బమ్ చిక్ బమ్' అనే చిత్రం నిర్మించబడుతోందని సమాచారం. వివరాల్లోకి వెళితే మాస్ రాజా రవితేజ హీరోగా, అందాల త్రిష హీరోయిన్ గా ‘బమ్ చిక్ బమ్’ అనే చిత్రం యుటివి మూవీస్ వారు తెలుగు, తమిళ బాషలలో నిర్మించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన 'బ్యాండ్ బాజా బారాత్' అనే చిత్రాన్ని తెలుగులో 'బమ్ చిక్ బమ్' పేరుతో రీమేక్ చేస్తున్నారట. బాలీవుడ్ లో 'బ్యాండ్ బాజా బారాత్' చిత్రంలో రణవీర్ సింగ్ నటించిన పాత్రలో తెలుగులో మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తూండగా, అనుష్క శర్మ నటించిన పాత్రలో తెలుగులో త్రిష హీరోయిన్ గా నటిస్తూందని సమాచారం.

బాలీవుడ్ లో నిర్మించబడిన ‘బ్యాండ్ బాజా బారాత్’ చిత్రం పూర్తి వినోదభరిత చిత్రంగా ప్రేక్షకాదరణ పోందింది. కాగా రవితేజ, త్రిష కాంబినేషన్ కృష్ణ లో ఇరగదీసిన ఈ జంట ఈ సారి ఎలా ఉంటుందనేది ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ‘బ్యాండ్ బాజా బారాత్’ చిత్రంలో కొన్ని లిప్ లాక్ సీన్లు యువతను ఆకట్టుకున్నాయి. మరి తెలుగులో ఈ ‘బమ్ చిక్ బమ్’ చిత్రంలో హీరో రవితేజతో హీరోయిన్ త్రిష లిప్ లాక్ సీన్లలో నటించటానికి అంగీకరిస్తుందా...? ఇటీవల విడుదలైన ‘తీన్ మార్’ చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ తో త్రిష లిప్ లాక్ సీన్లలో హ్యాపీగా నటించింది కనుక ‘బమ్ చిక్ బమ్’ చిత్రంలో కూడా రవితేజతో త్రిష లిప్ లాక్ సీన్లలో నటించేందుకు అంగీకరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సినీ పండితులంటున్నారు.

No comments:

Post a Comment