BREAKING NEWS
Saturday, April 23, 2011
యంగ్ హీరో సినిమాపై అల్లు అరవింద్ సెటైర్..
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఏం మాట్లాడినా అందులో వ్యంగ్యం వుంటుంది. అసలలా వుండేలాగానే ఆయన మాట్లాడతారు. రీసెంట్ గా జరిగిన '180' సినిమా ఆడియో ఫంక్షన్ లో కూడా అలాగే చమత్కారంగా మాట్లాడారు. ఆ వేడుకలో ప్రదర్శించిన '180' సినిమా ట్రైలర్ చూసిన అరవింద్ ఒక్కసారిగా భయపడ్డాడట. తర్వాత తన ప్రసంగంలో ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ, ‘ఇది మా '100% లవ్' సినిమాకి గట్టి పోటీనిచ్చేలా కనపడుతోంది. అందుకే ఈ సినిమా రిలీజ్ టైం లో మా సినిమా రిలీజ్ చేయాలంటే కాస్త భయంగా కూడా వుంది’ అంటూ అరవింద్ చెప్పడంతో, '180' సినిమా హీరో సిద్ధార్థ్, దర్శక నిర్మాతలు తెగ ఆనందపడిపోయారు. అరవింద్ అంతటి ప్రొడ్యుసర్ తమ సినిమా చూసి భయపడుతున్నాడంటే, ఇక మనం హిట్ కొట్టేసినట్టే అనుకున్నారు. అయితే, 'అరవింద్ సెటైర్లు బాగా వేస్తాడన్న సంగతి పాపం..వాళ్లకు తెలియదేమో. ఇది కూడా అలాంటిదే!' అంటూ ఫంక్షన్ కి హాజరైన మీడియా వాళ్లు నవ్వుకున్నారు!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment