రజనీకాంత్ సినిమాలో కేవలం ఆయన మాత్రమే ఉంటే సినిమాలు ఆడవని ఎవరు నమ్మినా నమ్మకపోయిన, ఆయన మాత్రం నమ్ముతాడు. ముఖ్యంగా తన పక్కన హీరోయిన్ కూడా అందంగా ఉంటే తప్ప తన సినిమా అయినా జనానికి నచ్చదని రజనీ భావిస్తాడు. అందుకే హీరోయిన్ల మీద కోట్లు పోయించి మరీ బాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాడు. కోట్లు ధారబోసిన హీరోయిన్లు చూడ్డానికి కూడా బాగుండాలి కాబట్టి రజనీకాంత్ వారి గెటప్ దగ్గర్నుంచి ప్రతి అంశాన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు.
‘రాణా’ చిత్రంలో నటిస్తున్న దీపికా పడుకొనే మేకప్ నచ్చకపోవడంతో రజనీకాంత్ షూటింగ్ ఆపించేశాడు. ఆమెకి సరైన మేకప్ కుదిరే వరకు షూటింగ్ చేసేది లేదని తెగేసి చెప్పాడు. రజనీకాంత్ ఆజ్ఝలను అనుసరించి ఇప్పుడు దీపికకి కొత్త లుక్ తీసుకొచ్చేందుకు విదేశీ మేకప్ నిపుణులు ప్రయత్నిస్తున్నారు. శంకర్ తో సినిమా చేస్తే ఇలాంటివన్నీ అతనే చూసుకుంటూ ఉంటాడు. అందుకే రజనీ అతనితో సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఎల్లప్పుడూ అతనితోనే చేయలేడు కనుక అప్పుడప్పుడు ఇలా కెఎస్ రవికుమార్ లాంటి సీనియర్లని నమ్ముకుంటున్నాడు.
No comments:
Post a Comment