భారీ చిత్రాలు అతి తక్కువ వ్యవధిలో పోటీ పడిప్పుడు నష్టం ఎలా ఉంటుందనేది ఇటీవల పలు సందర్బాల్లో రుజువైంది. బృందావనం, రోబో, ఖలేజా క్లాష్ లో ఖలేజా అట్టర్ ప్లాప్ అయితే బృందావనం హిట్టయింది. రోబో బ్లాక్ బస్టర్ గా నిలిచింది కానీ ఈ సినిమాల మధ్య గ్యాప్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇంకా బెటర్ గా ఫెర్ ఫార్మ్ చేసి ఉండేవని ట్రేడ్ వర్గాలు తేల్చాయి. అలాగే నాగవల్లి, రగడ చిత్రాలు విడుదలైనప్పుడు, సంక్రాంతి పలు చిత్రాలు పోటీ పడ్డప్పుడు కూడా ఒక సినిమా వల్ల మరో సినిమా ఎంతో కొంత నష్టపోయింది. ముఖ్యంగా ఎక్కువ ప్రింట్లతో ఎక్కువ థియేటర్లలో విడుదలవుతున్న ఈ ట్రెండులో రెండు భారీ చిత్రాల నడుమ కనీసం రెండు వారా గ్యాప్ ఉంటే ఇరువర్గాలకీ శ్రేయస్కరమని విశ్లేషకులు అంటున్నారు.
అందుకే వేసవిలో విడుదలకి సన్నద్దమవుతున్న ఎన్టీఆర్ సినిమా ‘శక్తి’, పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్’ చిత్రాల మధ్య రెండు వారాల గ్యాప్ ఖచ్చితంగా ఉండేలా ఆయా చిత్రాల నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారు. ఏ కారణాల వల్ల అయినా ముందు అనుకున్న తేదీలో మార్పు జరిగినా కానీ మరో చిత్రం కూడా అందుకు తగ్గట్టే వెనక్కి వెళ్లి రెండు వారాల డిస్టెన్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తుందట. అయితే ఆ చిత్రాల మధ్య అగ్రిమెంట్ వరకు బానే ఉంది కానీ ఈ మధ్య లో మరేదైనా భారీ చిత్రం వచ్చి క్లాష్ అయితేనే ఇబ్బంది తలెత్తుతుంది.
No comments:
Post a Comment