BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Friday, March 4, 2011

మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఒకపక్క భయం..మరోప్రక్క నిరాశ...!?

Mahesh Babuపోకిరీ' సినిమా తర్వాత కొన్నేళ్ల గ్యాప్ తో మళ్లీ మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి మనకు తెలుసు. 'ది బిజినెస్ మేన్' పేరుతో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. దీనికి 'గన్స్ డోంట్ నీడ్ అగ్రిమేన్ట్స్' అనే ట్యాగ్ లైన్ పెట్టారు. కాగా, ఈ చిత్రం షూటింగు మే 20 న హైదరాబాదులో ప్రారంభం అవుతుంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటించే అవకాశం వుంది. కాగా, ఈ చిత్రాన్ని ఏకకాలంలో హిందీలో కూడా నిర్మిస్తారని తెలుస్తోంది. అందులో అభిషేక్ బచ్చన్ హీరోగా నటిస్తాడనీ, హిందీ వెర్షన్ కి రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తాడనీ సమాచారం.

అలాగే రీసెంట్ గా మణిరత్నం సినిమాలో నటించబోతున్నాడు అని చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నాడు మహేష్ బాబు. కానీ ఈ వార్త విన్న మహేష్ అభిమానులు మాత్రం కంగారు పడుతున్నారు. ఇప్పటికే మణిరత్నం సంవత్సరాలు తరబడి తీసిన రావన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దీనికి తోడు ఇప్పుడు మహేష్ తో తీయబోయే సినిమా ‘పొన్నియన్ సెల్వమ్’ నవల ఆధారంగా వందల సంవత్సరాల నాటి చోళుల కధ అంట. ఇప్పటికే ఖలేజా సినిమా గురుంచి సంవత్సరాలు వేచి చూసినా గాని అభిమానులను మెప్పించలేకపోయింది.ఇప్పుడు మణిరత్నం తో సినిమా అంటే అది రిలీజ్ కావడానికి మినిమం రెండు మూడు సంవత్సరాలు పట్టడం ఖాయం. మహేష్ ఫ్యాన్స్ కి తమ హీరో వరుస సినిమాల గ్రీన్ సింగ్నల్ ఇస్తూ పోతుంటే ఒకప్రక్క ఆనందం, మరోప్రక్క భయం, తర్వాత చిత్రాలైనా హిట్ ఇస్తాయోలేదో అనే అయోమయం. ఇప్పటికే మహేష్ బాబు కి బద్ధకం బాగా పెరిగిపోయిందని వార్తలు కూడా వస్తున్నాయి. ట్విటర్ లో ఉన్నంత యాక్టివ్ గా సెట్స్ మీద వుండటం లేదని దర్శకుడు శ్రీను వైట్ల భాదపడుతున్నాడని టాలీవుడ్ టాక్.ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు తెర మీదకి వస్తుందో వేచి చూడాల్సిందే.

No comments:

Post a Comment