హైదరాబాద్: సినీ హీరో, ప్రముఖ రాజకీయ నాయకుడు మెగాస్టార్ చిరంజీవిని వ్యతిరేకిస్తూ ఉన్న ఓ వెబ్‌సైట్‌పై ఆయన అభిమానులు కొందరు గురువారం సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చిరు అభిమానుల ఫిర్యాదు మేరకు సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చిరంజీవికి వ్యతిరేకంగా ఐహేట్‌చిరు.కాం అనే వెబ్‌సైట్ ఉందని దానిపై, దాని నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని చిరు అభిమానులు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర చిరంజీవి యువత మరియు చిరంజీవి ఫ్యాన్స్ కలిసి గురువారం సిసిఎస్ పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ ఇచ్చారు.
ఆ వెబ్‌సైట్‌లో చిరంజీవిని, ఆయన ఫ్యామిలీకి చెందిన ఇతర హీరోలను కించపరుస్తూ కొన్ని మెసేజ్‌లు ఉన్నట్టు చెప్పినట్టుగా తెలుస్తోంది. అభిమానుల ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 43 మరియు 63 కింద కేసు బుక్ చేశారు. కాగా గత నెలలో యువరత్న బాలకృష్ణ అభిమానులు కూడా ఐహెట్‌బాలయ్య అనే వెబ్‌సైట్‌పై సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా అభిమానుల ఫిర్యాదు మేరకు ఆ రెండు వెబ్‌సైట్‌లను తొలగించనున్నట్టు చెప్పారు.
No comments:
Post a Comment