BREAKING NEWS
Friday, March 4, 2011
రజనీ స్పెషల్: మూడు పాత్రలు...ఆరుగురు హీరోయిన్స్
రజనీకాంత్ తాజా చిత్రం 'రాణా' లో ఆయన త్రిపాత్రాభినయం చేస్తున్నారు. అందుకోసం ఆయన సరసన ముగ్గరు హీరోయిన్స్ ని బుక్ చేసారు. పెద్ద రజనీకాంత్ సరసన రేఖ నటిస్తుంది. మధ్య వయస్కుడైన రజనీతో విద్యాబాలన్ జత కట్టబోతోంది. యువకుడైన రజనీ సరసన దీపిక కనిపిస్తుంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని ఎరోస్ ఇంటర్నేషనల్, సౌందర్య రజనీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రజనీ సోదరి పాత్రకు మాధురీ దీక్షిత్‌ని సంప్రదించారు. ఆమె తిరస్కరించారు. 'రజనీకి సోదరిగా నటించడం అంటే కష్టమే' అన్నారట. ఏప్రిల్ నుంచి చిత్రీకరణ మొదలుపెడతారని తెలిసింది. అలాగే ఈ చిత్రంలో మరో ముగ్గురు హీరోయిన్లు కూడా ఎంపిక కావాల్సి వుందని తెలుస్తోంది. అంటే టోటల్‌గా ఈ చిత్రంలో రజనీ సరసన ఆరుగురు హీరోయిన్స్ నటించబోతున్నారు. రోబో తర్వాత వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment