BREAKING NEWS
Thursday, February 17, 2011
జీవితాంతం చీకట్లో బ్రతికాలంటే కష్టం కదా...స్నేహ
రాత్రి పూట కరెంట్‌పోయి క్షణం వెలుతురు లేకపోతేనే మనం భరించలేం కదా. అలాంటిది జీవితాంతం చీకట్లో బతికాలంటే వారి పరిస్ధితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అందుకే అంతా నేత్రదానం చేయాలంటాను. ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు అందరికీ అవగాహన కల్పించాలి...మననంతా సహకరించాలి అంటోంది స్నేహ. ఆమె రీసెంట్ గా తన కళ్ళను నేత్రదానం చేసింది. అన్ని దానాల్లోకెల్లా నేత్రదానం గొప్పది అన్న మాటను నిజం చేసింది. తనలాంటి వారు చేసే పనులను చూసి మరింతమంది ప్రేరణ పొందుతారనే ఉద్దేశ్యంతో ఈ పనిచేసాను అంది. అలాగే నన్ను చూసి నలుగురైనా ఈ మంచి కార్యక్రమానికి పాల్పడుతారు కదా అని నేను ప్రచారం చేస్తున్నాను'' అని అంటోంది స్నేహ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment