తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు పూరి జగన్నాద్..అందుకు కారణం ఆయన అసిస్టెంట్‌గా చేరింది ఎవరి దగ్గర అనుకుంటున్నారు ఎవరి పేరు చెబితే తెలుగు ఇండస్ట్రీకి చెమటలు పడతాయో ఆయనే రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్‌గా చేరి తన డైరెక్షన్‌లో తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేసినటువంటి పోకిరిని అందించారు. దాంతో పూరి జగన్నాధ్ పేరు తెలుగు సినిమా చరిత్రలో అలా నిలచిపోయింది.
ఇది మాత్రమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ తనలాంటి కత్తిలాంటి డైరెక్టర్లుని కూడా అందివ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన వ్యక్తులు మెహర్ రమేష, పరుశరామ్. వీళ్శిద్దరూ పూరి జగన్నాధ్‌కు రెండు చేతులు. ఇంతకీ మనం వీళ్శ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే పూరి జగన్నాధ్ అంబులో పోదిలోంచి వచ్చినటువంటి ఈఇద్దరూ డైరెక్టర్లు ఇప్పుడు నందమూరి ఫ్యామిలీకి మరియు నారా ఫ్యామిలీ మద్య పోటీ వాతావరణం ఏర్పాటు చేయడానికి కారణం అవుతున్నారు కాబట్టి.
ఎన్టీఆర్ కాలం నుండి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీని నందమూరి ప్యామిలీ ఏలుతా వచ్చింది. ఇప్పుడు కొత్తగా నారా వారి ఫ్యామిలీ నుండి ఓ నటుడు రావడం జరిగింది. ఈ రెండు కుటుంబాలకు మొదటి నుండి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. నందమూరి ప్యామిలీ నుండి బాలకృష్ణ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న లాంటి స్టారా రావడం జరిగింది. అదే విధంగా నారా వారి ప్యామిలి నుండి బాణం అనే సినిమా ద్వారా నారా రోహిత్ పరిచయం అయ్యాడు.
ఐతే ఆడైరెక్టర్స్‌కి వీరికి సంబంధం ఏమిటని అనుకుంటున్నారా..సంబంధం చాలా ఉందండి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో అశ్వినిదత్ ఎన్నో కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చుపెట్టి ఎంత ప్రతిష్టాత్మకంగా శక్తి అనే సినిమాని నిర్మిస్తున్నారు. అదేవిధంగా నారా రోహిత్ హీరోగా పరుశరామ్ దర్శకత్వంలో సోలో సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.. అంతేకాకుండా సోలో సినిమాని జూనియర్ ఎన్టీఆర్ శక్తికి పోటీగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈరెండు సినిమాలు ఒకేసారి విడుదలైతే ఎవరెవరి సత్తా ఎంత ఉంటుందో తెలిసిపోవడమే కాకుండా భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ వల్ల రాజకీయంగా ఏమైనా ఇబ్బంది వస్తే దానిని ఎదుర్కోవడానికి నారా ఫ్యామిలీ నుండి ఓ హీరో అవసరం అని నారా అభిమానులు అనుకున్నట్లు సమాచారం.
ఇక డైరెక్టర్లు విషయానికి వస్తే మెహార్ రమేష్ గతంలో జూ ఎన్టీఆర్‌కు కంత్రి, ప్రభాస్‌కు బిల్లా లాంటి హిట్స్ ఇవ్వడం జరిగింది. అదే పరుశరామ్ విషయానికి వస్తే రవితేజతో ఆంజనేయులు లాంటి డిజాస్టర్ ఫిల్మ్ ఇవ్వడం జరిగింది..
No comments:
Post a Comment