రొమాన్స్ చేయడం ఎప్పుడయినా చాలా ధ్రిల్ ఇచ్చే విషయమే. అయినా లైఫ్ ఉన్నది మనకు అణుగుణంగా బ్రతకటానకే..ఎవరికోసమో ఎవరూ ఉండరు. ఉన్నంత కాలం ఎంజాయ్ చేయాలి అంటోంది సమీరా రెడ్డి. అలాగని నేను ఎవరినీ జీవిత భాగస్వామిగా భావించలేదు. అందరూ ఫ్రెండ్సే. ఎవరితోనూ హద్దులు దాటలేదు మన జాగ్రత్తల్లో మనం ఉంటూ రొమాన్స్ ని ఎంజాయ్ చేయాలి. గడిచిపోయిన కాలం తిరిగిరాదు కదా అంటోంది. ప్రస్తుతం ఆమె గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించిన 'ఎర్ర గులాబీలు' విడుదలకు రంగం సిద్దమైంది. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో ఇలా చెప్పుకొచ్చింది.
గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో మనదేశం మూవీస్ పతాకంపై అశోక్ వల్లభనేని నిర్మించిన 'ఎర్ర గులాబీలు' చిత్రం ఈ నెల 18న విడుదల కాబోతోంది. సమీరారెడ్డి ప్రధాన పాత్రధారి అయిన ఈ చిత్రంలో కథకి కీలకమైన మరో పాత్రని సమంత చేసింది. ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ అని అభివర్ణిస్తున్నారు. కార్తీక్, వీరా హీరోలుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: రంగనాథ్ రావే, ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, కూర్పు: ఆంథోని, కళ: రాజీవన్, ఫైట్స్: శివ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె. వేణుగోపాల్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ మీనన్.
No comments:
Post a Comment