స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇండియన్ సమురాయ్ గా రాబోతున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం బద్రీనాథ్ లో అల్లు అర్జున్ పాత్ర అది. మోడరన్ గా ఉంటూనే డివోషనల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కధ ఇది. ఇది మాత్రమే కాకుండా అల్లు అర్జున్ ఫ్లాష్ బ్లాక్‌లో వచ్చేటటువంటి సీన్లు సినిమాకే పెద్ద హైలెట్‌గా నిలుస్తాయని అంటున్నారు. ఈసినిమాకి కధ అందించినటువంటి చిన్నికృష్ణ గతంలో సినిమాకి ప్రాణం సెకండాఫ్ లో వచ్చేటటుంటి డివోషనల్ బ్యాక్ డ్రాప్‌యేనని చాలా సార్లు చెప్పడం మనకు తెలిసిందే. ఈసినిమాని చాలా అత్యున్నత విలువలతో ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ పనులను జరుపుకుంటోంది.
దశావతారం చిత్రానికి కెమెరామన్ గా పని చేసిన రవి వర్మ ఈ చిత్రానికి ఛాయా గ్రహణం అందిస్తుండగా, పీటర్ హెయిన్స్ ఫైట్స్ ను సమకురుతున్నాడు. గతంలో అర్జున్ తో బన్ని వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకుడు. తమన్నా నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఈ సమ్మర్ కు బద్రినాథ్ విడుదల ........
No comments:
Post a Comment