BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Friday, June 10, 2011

జూ ఎన్టీఆర్‌కు బాలయ్య షాక్, సోదరుడు హరికృష్ణకు కౌంటర్..!

Balakrishna-Jr Ntrహైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకుడు, సినీ హీరో నందమూరి బాలకృష్ణ తన సోదరుడు హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌కు షాక్ ఇచ్చారు. నందమూరి హరికృష్ణను కౌంటర్ చేయడానికి బాలకృష్ణ సిద్ధపడినట్లే కనిపిస్తున్నారు. అందుకు ఆయన తన జన్మదిన వేడుకలను వేదికగా చేసుకున్నారు. తన తండ్రి స్వర్గీయ ఎన్టీ రామారావు కుటుంబానికి ప్రాధాన్యం తగ్గిందనే వార్తలపై ఆయన శుక్రవారం తన జన్మదిన వేడుకల్లో స్పందించారు. ఎన్టీఆర్ కుటుంబానికి పార్టీలో ప్రాధాన్యం తగ్గలేదని, వ్యవస్థలాంటి పార్టీలో అందరూ సమానమేనని ఆయన అన్నారు. తద్వారా ఆయన జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణల వాదనను కొట్టిపారేశారు. 

తెలుగుదేశం పార్టీలో నందమూరి, నారా కుటుంబాల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని వస్తున్న వార్తల నేపథ్యంలో బాలకృష్ణ ప్రకటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీ పగ్గాలను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో అంతర్గత పోరుకు శ్రీకారం చుట్టారనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన పార్టీ మాహానాడులో హరికృష్ణ చంద్రబాబుపై అలక వహించిన సూచనలు స్పష్టంగా బయటపడ్డాయి. దానికితోడు, సినిమా షూటింగుల పేరు చెప్పి జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు డుమ్మా కొట్టారు.

చంద్రబాబుతో విభేదిస్తున్న హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లకు సహాయం అందించేందుకు సిద్ధంగా లేరనేది అర్థమవుతోంది. ఆయన తన బావ చంద్రబాబుకు పూర్తి సహకారం అందించేందుకు సిద్ధపడినట్లు కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఆయన తన అల్లుడు నారా లోకేష్ రాజకీయ ప్రవేశానికి కూడా సహకరించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను పోటీ నుంచి తప్పించడమే బాలకృష్ణ ప్రధాన ధ్యేయమని అంటున్నారు

No comments:

Post a Comment