ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు వ్యాఖ్యలను తెలుగు సినిమా హీరో రామ్ చరణ్ తేజ్ తప్పు పట్టారు. దాసరి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. చలనచిత్ర అవార్డుల కార్యక్రమాలకు హీరోయిన్లు రావడం లేదని దాసరి నారాయణ రావు చేసిన వ్యాఖ్యలో నిజం లేదని ఆయన అన్నారు. అవార్డులు సరైనవి అయితే హీరోయిన్లు తప్పకుండా వస్తున్నారని ఆయన చెప్పారు. నిరుటి అవార్డుల కార్యక్రమానికి హీరోయిన్లు వచ్చారని, తాను కూడా అందులో పాల్గొన్నానని, హీరోయిన్లు రావడాన్ని తాను చూశానని ఆయన అన్నారు. సదర్న్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమంలో ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
మగధీర విజయం సాధించడంతో అదే పంథాలో వస్తున్న ఇతర సినిమాలు దెబ్బ తింటున్నాయని, అందులో మీ బాధ్యత ఎంత అని అడిగితే మగధీర సినిమాను తామంతా కష్టపడి చేశామని, ఆ సినిమా పూర్తి కావడంతో తన బాధ్యత తీరిపోయిందని, అంతటితో అది ముగిసిపోతుందని, ఆ తర్వాత ప్రారంభమయ్యే సినిమా బాధ్యతను తాను స్వీకరిస్తానని ఆయన అన్నారు. సిక్స్ ప్యాక్ బాడీపై ప్రశ్నించగా, తాను వ్యాయామం చేస్తున్నానని, దుస్తులు ఇప్పేసి ప్రదర్శించాలని తనకు లేదని ఆయన అన్నారు. తన సినిమాల్లో ఏది ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు నామినేట్ అవుతుందనేది తాను చెప్పలేనని ఆయన అన్నారు

No comments:
Post a Comment