విజయవాడ: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న భానుకిరణ్‌కు, ప్రముఖ సినీ నిర్మాత సి.కళ్యాణ్‌కు లింకులు ఉన్నట్టుగా వచ్చిన వార్తలు నిజమే అన్నట్లుగా కనిపిస్తోంది. విజయవాడకు చెందిన అన్నపూర్ణ ఇండస్ట్రీస్ యజమాని తనయుడు కృష్ణప్రసాద్ వ్యాఖ్యల ద్వారా వారిద్దరి మధ్య లింకు ఉన్నట్లుగా కనిపిస్తోంది. భానుకిరణ్, సి.కళ్యాణ్‌లు కలిసి తన తండ్రి వద్దకు వచ్చే వారని కృష్ణప్రసాద్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇద్దరూ తరుచూ తన తండ్రిని కలిసే వారన్నారు. భాను ఎక్కడున్నాడో తన తండ్రికి తెలుసునని కృష్ణప్రసాద్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఇటీవల అన్నపూర్ణ ఇండస్ట్రీస్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. మద్దెలచెర్వు సూరి ఆయనకు ప్రధాన అనుచరుడుగా పేరుపడ్డ భానుకిరణ్‌ల మధ్య అన్నపూర్ణ ఇండస్ట్రీస్ కారణంగానే విభేదాలు పొడసూపి సూరి హత్యకు దారి తీశాయనే వార్తలు కూడా వచ్చాయి. సిసిఎస్ పోలీసు స్టేషన్‌లో కూడా అన్నపూర్ణ కారణంగానే సూరి హత్య జరిగిందనే కోణంలో కేసు నమోదు చేసినట్లుగా వార్తలు వచ్చాయి

No comments:
Post a Comment