రాజా చెన్నైలో ఉన్నప్పుడు కనిమొళి ఇంట్లోనే బస, కనిమొళి కూడా తరుచూ రాజా క్యాంపు కార్యాలయానికి వెళ్లే వారంట. పార్టీలో పలు నిర్ణయాలు కూడా రాజా, కనిమొళి కలిసే తీసుకునే వారంట. రాజా మంత్రి అయ్యాక కలైంజ్ఞర్ టీవికి అనుమతులు ఇప్పించాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి స్పేక్ట్రం కుంభకోణంలో ఇరుక్కు పోయారు. టాటా - నీరా రాడియా మధ్య జరిగిన సంభాషణ టేపులలో రాజా - కనిమొళి మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుందనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయంట. ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారన్న వార్తలు కూడా గతంలో వచ్చినప్పటికీ కనిమొళి గానీ, రాజా గానీ ఖండించలేదంట. అంతేకాదు రాజా - కనిమొళి మధ్య ప్రేమ సంగతి తెలిసిన కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి రాజాను తన చిట్టి చెల్లెలితో తిరగవద్దని హెచ్చరించారంట. చెన్నై విమానాశ్రయంలో కొట్టినంత పని కూడా చేశారు. డిఎంకె పార్టీ నుండి రాజాను బహిష్కరించాలని అళగిరి తన తండ్రి కరుణానిధిపై ఒత్తిడి తీసుకు రాగా, కనిమొళి చర్యలు తీసుకుంటే బావుండదని తండ్రిని హెచ్చరించారు. రాజా మధ్య అన్నాచెల్లెలు, తండ్రి బిడ్డల మధ్య కూడా పలు మార్లు విభేదాలు పొడసూపాయి.
మూడు నెలలుగా తీహార్ జైలులో ఒంటరిగా విచారంగా కనిపించిన రాజా కనిమొళి కూడా జైలుకు రాగానే ఉత్సాహంగా కనిపించారంట. ఇదంతా కనిమొళి మాయే అని అభిప్రాయపడే వారున్నారు. కనిమొళి కూడా తీహార్ జైలుకు వెళ్లడానికి, కోర్టుకు వెళ్లడానికి మొదట భయపడిందంట. అయితే రాజా సూచనల మేరకు ఆమె ఇప్పుడు భయపడటం లేదంట. మూణ్ణెళ్ల క్రితం వరకు బయట లవ్ ఎఫైర్ నడిపిన రాజా, కనిమొళిలు ఇప్పుడు జైలులో ప్రేమ పక్షులుగా మారి పోయారంట. ప్రస్తుతం వారు జైలులోనే తమ పాత జీవితాన్ని గుర్తు చేసుకుంటున్నారంట. దీంతో వారు జాలీ జీవితం గడుపుతున్నారంట. అంతేకాదు వీరి లవ్ ఎఫైర్ కథాంశంగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ ఓ చిత్రాన్ని కూడా నిర్మించడానికి సిద్ధమయిందంట. ఇందుకు అనుమతులు కూడా తీసుకుందని సమాచారం. అయితే ఈ చిత్రంలో రొమాన్స్ కన్నా ట్రాజెడీ సన్నివేశాలే ఎక్కువ ఉంటాయంట
No comments:
Post a Comment