బద్రినాథ్ సినిమాకి కనీవినీ ఎరుగని రీతిలో పబ్లిసిటీ చేసి ‘దండోరా వాయింపు’లో అందర్నీ మించిపోయిన అల్లు అరవింద్ అండ్ కో ఈ చిత్రానికి తప్పకుండా ప్రీమియర్ షో వేస్తారని భావించారు. గజిని, మగధీరలాంటి చిత్రాలకి భారీ స్థాయిలో ప్రీమియర్ షోస్ వేసిన గీతా ఆర్ట్స్..బద్రినాథ్ విషయంలో వెనుకంజ వేసింది. భారీ అంచనాలున్న ఈ చిత్రాన్ని ప్రీమియర్ వేసి టాక్ పాజిటివ్ గా వచ్చి ఉన్నట్టయితే తప్పకుండా తొలి రోజు వసూళ్లు మోత మోగిపోయేవి.
నిజంగా సినిమాపై అంతటి నమ్మకం ఉన్నట్టయితే ఆ అవకాశాన్ని గీతా ఆర్ట్స్ వదులుకుని ఉండేది కాదనేది సినీ వర్గాల అభిప్రాయం. తీరా ఇంత హైప్ తీసుకొచ్చి, ప్రీమియర్ షో టాక్ తేడా వస్తే అప్పుడు ఫస్ట్ డే కలెక్షన్స్ చాలా చోట్ల తగ్గిపోతాయనే భయంతోనే వారు ప్రీమియర్ షో వేయలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే గీతా ఆర్ట్స్ నిర్మించే ప్రతి సినిమాకి ప్రీమియర్స్ వేయరని, వేయని చిత్రాల గురించి మాట్లాడరేంటని గీతా ఆర్ట్స్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. మిగతా వాటి మాట ఎలా ఉన్నా కానీ బద్రినాథ్ లాంటి భారీ అంచనాలున్న చిత్రానికి ప్రీమియర్ షో అనేది మాండేటరీ అనుకోవాలి. కానీ వేయడానికి జంకారంటే నిర్మాత నమ్మకం గురించి అంతో ఇంతో శంకించాలి

No comments:
Post a Comment