తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో పోలిస్తే మహేష్ బాబుది కాస్త స్పీడు తక్కువే. కృష్ణ ఏడాదికి పది, పన్నెండు సినిమాలు చేసిన రోజులు కూడా వున్నాయి. అయితే, మహేష్ ఏడాదికి ఒక సినిమా చేయడమే గగనంగా కనిపిస్తోంది. డిమాండ్ వుండి కూడా సినిమాలు చేయలేకపోతున్నాడు. అయితే, ఇప్పుడా స్పీడుని మరోలా చూపిస్తున్నాడు. ఎడాపెడా అడ్వర్ టైజ్ మెంట్లు ఒప్పేసుకుంటున్నాడు. పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసడార్ గా కమిట్ అయిపోతున్నాడు. ఇప్పటికే థమ్సప్, అమృతాంజన్, నవరత్న, యునివేర్సాల్, ప్రోవోగ్, ఐడియా ఉత్పత్తులని ప్రమోట్ చేస్తున్న మహేష్, తాజాగా వివేల్ షాంపు కి కూడా అండార్స్ చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే, సినిమాలకన్నా ఇవే బాగా వర్కౌట్ అవుతున్నాయట. కోట్లలో ఆదాయం వస్తున్నట్టు తెలుస్తోంది.!
కాగా మహేష్ బాబు సినిమాల్లో కంటే ఎక్కువగా యాడ్ ఫిలింస్ లో కనిపిస్తున్నాడని జోకులు పేలుతున్నా అది కాంప్లిమెంట్ గానే తీసుకుంటూ కొత్త కొత్త బ్రాండులతో మహేష్ ఒప్పందాలు చేసుకుంటున్నాడు. ఏ ఇతర హీరోలనీ కాకుండా మహేష్ నే ఈ బ్రాండ్లు ఎందుకు వరిస్తున్నట్టు? అఫ్ కోర్స్ మహేష్ అందగాడే, పెద్ద స్టారే కాదని అనలేం. అయితే మహేష్ ఒక్కడే పెద్ద స్టార్ కాదు కదా?అతడి రేంజ్ లేదా అతడిని మించిన స్టార్లు ఇంకా ఉన్నారు కదా? మరి వాళ్లకి రాని యాడ్లు ఇతనికే ఎందుకొస్తున్నట్టు?దీనికంతటికీ కారణం మహేష్ భార్య నమ్రతే అని తెలుస్తోంది. మహేష్ ని ఈ బ్రాండ్ అండార్స్ మెంట్ కి ప్రోత్సహించిందీ, ఇప్పుడు వివిధ కంపెనీలతో చర్చలు జరపు తున్నదీ నమ్రతేనట. బాలీవుడ్ స్టార్స్ లా బీభత్సమైన కొటేషన్ అయితే చెప్పడు కాబట్టి మహేష్ గో టైఅప్ కి ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండడం లేదు. ఈ సైడ్ ఇన్ కమ్ బాగుండడంతో నమ్రత జోరు పెంచి కనీసం మూడు నెలలకో కొత్త అసైన్ మెంట్ తీసుకొస్తుందని సమాచారం.
No comments:
Post a Comment