సంస్థ: వైజయంతీ మూవీస్
నటీనటులు: ఎన్టీఆర్ , ఇలియానా , సోనూ సూద్, ప్రభు, మంజరి, జాకీష్రాఫ్, పూజాబేడీ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కృష్ణభగవాన్, తదితరులు.
మాటలు: సత్యానంద్
రచనా సహకారం: యండమూరి జె.వి. భారతి, తోటప్రసాద్, డీఎస్ కన్నన్
ఆర్ట్: ఆనంద్‌సాయి
కెమెరా: సమీర్ రెడ్డి
సంగీతం: మణిశర్మ
సమర్పణ: సి. ధర్మరాజు
నిర్మాత: సి.అశ్వనీదత్
స్క్రీన్ ప్లే.. దర్శకత్వం: మెహర్ రమేష్.
నటీనటులు: ఎన్టీఆర్ , ఇలియానా , సోనూ సూద్, ప్రభు, మంజరి, జాకీష్రాఫ్, పూజాబేడీ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కృష్ణభగవాన్, తదితరులు.
మాటలు: సత్యానంద్
రచనా సహకారం: యండమూరి జె.వి. భారతి, తోటప్రసాద్, డీఎస్ కన్నన్
ఆర్ట్: ఆనంద్‌సాయి
కెమెరా: సమీర్ రెడ్డి
సంగీతం: మణిశర్మ
సమర్పణ: సి. ధర్మరాజు
నిర్మాత: సి.అశ్వనీదత్
స్క్రీన్ ప్లే.. దర్శకత్వం: మెహర్ రమేష్.
ఈసారి తీసే సినిమా చాలా ప్రత్యేకంగా ఉండాలని, రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకూడదని అనుకున్నాం.హేమాహేమీలైన రచయితలు కథాసహకారాన్ని అందించడంతో చాలా పకడ్బందీగా కథ తయారైంది. 300 మంది యూనిట్ సభ్యులతో 18 నెలల పాటు కష్టపడి ఈ సినిమాని అద్భుతంగా రూపొందించాడు మెహర్‌రమేష్ అంటూ శక్తి చిత్రం విడుదలకు ముందు అశ్వనీదత్ మీడియాలో కంటిన్యూగా ఊదరకొట్టారు.దాంతో అంత పెద్ద ప్రొడ్యూసర్ చెప్పారు కదా అని నమ్మి వెళ్ళిన వారికి ప్రేక్షకుడుని ఈ రోజు ఏప్రియల్ ఫూల్స్ డే కదా గుర్తులేదా అని ఓ నవ్వు నవ్వి వెటకారం చేసింది.జూ.ఎన్టీఆర్ తన పరిధి మేరకు కష్టపడి చేసినా మెహర్ రమేష్ తన శాయశక్తులా శక్తి చిత్రాన్ని సీన్ సీన్ కీ దిగజారుస్తూ దెబ్బతీసాడు.హాలీవుడ్ చిత్రం ఛేజింగ్ లిబర్టీకి,మగధీరని కలిపి చేసినట్లున్న ఈ చిత్రం ఎన్టీఆర్ వీరాభిమానికి కూడా డైజస్ట్ చేసుకోవటం కష్టంగా మారింది.
సెంట్రల్ హోం మినిస్టర్ మహదేవరాయలు(ప్రభు)కి ఐశ్వర్య(ఇలియానా)ఒక్కత్తే కూతురు. ఆమెకి తన చుట్టూ ఉన్న సెక్యూరిటీ బంధనాలు తెంచుకుని స్వేఛ్చగా విహరించాలని కోరిక.దాంతో ఓ శుభముహూర్తాన్న ఇంట్లో వాళ్ళకి బురిడీకొట్టి జైపూర్ లో తేలుతుంది.అయితే ఆమెకు అక్కడ లోకల్ రౌడీలతో సమస్య ఎదురౌతుంది.అప్పుడు మన హీరో శక్తి(ఎన్టీఆర్)ఓ పెద్ద ఫైట్ తో ఎంట్రీ ఇస్తాడు.అక్కడనుంచి ఆమెకు గైడ్ లా వ్యవహిస్తూ దేశమంతటా తిరుగుతూ ఎప్పటికప్పుడు రక్షిస్తూంటాడు.ఇంతకీ ఆమెపై దాడి చేస్తుందెవరు...గైడ్ అయిన శక్తికి ఆమె చుట్టూ తిరుగుతూ రక్షించే అవసరం ఏమి వచ్చింది.అసలు శక్తి ఎవరు..శక్తికీ ఈజిప్టులో ఫక్తూన్(పూజాబేడి) కి సంభంధం ఏమిటన్నది మిగతా కథ.
సూపర్ హిట్ మగధీరలా తీర్చిదిద్దాలనే తాపత్రయంతో అదే పోలికలతో ఈ కథను తయారు చేసినట్లు అర్దమవుతూంటుంది.అయితే కథలో హీరో చేయటానికి ఏమి లేకపోవటంతో ఆ క్యారెక్టర్ ప్యాసివ్ గా మారి మైనస్ గా మారింది.ముఖ్యంగా మగధీరలో పే ఆప్ అయిన ఎలిమెంట్ ప్రేమ లాంటి బలమైన ఎమోషన్ ఏదీ ఈ చిత్రంలో కనిపించదు.ఇక ఫస్ట్ హాఫ్ అంతా హీరో పనిపాటా లేకుండా హీరోయిన్ వెనక తిరగటం,ఆమెను రక్షించటమే జీవితాశయం అన్నట్లు ఉండటం,అతనికి ఫైట్ చేయటానికి బలమైన మనుష్యులు తప్ప బలమైన సమస్య ఎదురుకాకపోవటంతో కథ పై ఆసక్తి ఉండదు.సమస్యలో పడని హీరోతో ప్రయాణించటమే కష్టమే అనిపిస్తుంది.పోనీ సెకెండాఫ్ లో అయినా ఏదన్నా జరుగుతుందా అంటే కేవలం హీరో తన ఫ్లాష్ బ్యాక్ వినటం తప్ప ఏమీ చెయ్యడు.విలన్స్ కూడా క్లైమాక్స్ దాకా ఎక్కడా హీరోకి డైరక్ట్ అవరు.దాంతో విలన్స్ కీ ,హీరో కి మధ్య పోరాటం మొదలయ్యేసరికే సినిమా పూర్తవుతుంది.అంతమంది హేమాహేమీ రైటర్స్ రాసిన ఈ స్క్రిప్టులో ఇది కథన సమస్య.
నటీనటుల్లో జూ.ఎన్టీఆర్ ఎప్పటిలాగే చాలా బాగా చేసారు.ఇలియానా గ్లామర్ ప్రదర్శనకు తప్ప మరిదేనికి పనికి రాలేదు.ఇక బ్రహ్మానందం,అలీ,కృష్ణభగవాన్,శ్రీనివాస రెడ్డి,వేణు మాధవ్ వంటి సీనియర్ కమిడెయన్స్ ఉన్నా కామిడి ఎక్కడా పండలేదు.ఎస్పీ బాలసుబ్రమణ్యం,జాకీ షరాఫ్,పూజా బేడిలు తమ పాత్రల పరిధిమేరకు నటించినా పెద్ద గా ఎలివేట్ కాలేదు.ఇక ప్లస్ ల విషయానికి వస్తే సినిమాలో ఎన్టీఆర్ డాన్స్ లు బాగా ఉన్నాయి.శక్తి ఫీఠాల మొత్తం ఒకేసారి తెరపై చూసే అవకాశం ఇస్తుంది.కెమెరా,ఎడిటింగ్ వంటివి సినిమా స్ధాయిలో ఉన్నాయి. సత్యానంద్ డైలాగులు పేలలేదు.ముఖ్యంగా సెకెండాఫ్ ప్లాష్ బ్యాక్ లో వచ్చే రుద్ర గెటప్,ఎపిసోడ్ నీరసం తెప్పిస్తాయి.
ఫైనల్ గా ఎన్టీఆర్ వంటి మాస్ అప్పీల్ వంటి హీరోని పెట్టుకున్న మెహర్ రమేష్ ఆయన్ను సరిగా వాడుకోలేదనిపిస్తుంది.లొకేషన్స్ మీద,ట్విస్టులు మీద పెట్టిన శ్రద్ద..కథ,కధనాలపై పెట్టి ఉండే బావుండనినిపిస్తుంది.అభిమానులుకు ఏమన్నా కొద్దో గొప్పో సినిమాను ఇష్టపడగలరేమోగాని,సామాన్య ప్రేక్షకుడుకి సినిమా ఎక్కటం కష్టమే.
No comments:
Post a Comment