BREAKING NEWS
Saturday, April 2, 2011
జాతీయ జెండా వివాదంలో ఎన్టీఆర్ "శక్తి"
ఈ రోజు రిలీజైన జూ.ఎన్టీఆర్ తాజా చిత్రం శక్తి బూట్ల వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలో ఆయన వాడిన బూట్లు మూడు రంగుల జెండాను పోలి ఉండడం అంతటా వివాదస్పదంగా మారింది.ఈ విషయమై ఎక్స్ సర్వీస్ మెన్ లు అబ్జెక్షన్ చెప్తున్నారు. ఈ విషయమై అప్పుడే మీడియాలో చర్చా గోష్టిలు మొదలయ్యాయి.ఈ సనిమాలో ఎన్.టి.ఆర్ వాడిన బూట్లపై మూడు రంగులు ఉన్నాయి.అవి జాతీయపతాకాన్ని పోలి ఉన్నట్లు టాక్ బయిటకు వచ్చింది.అంతేగాక ఆ స్టిల్ ను ఒక సినిమా పత్రిక ప్రచురించింది.జాతీయ పతాక నియామవళి ప్రకారం జాతీయ పతాకాన్ని కించపరిచే విధంగా ఎక్కడా వాడకూడదు.అంతేకాకా పూర్తిగా ,లేదా పాక్షికంగానైనా జాతీయ పతాకాన్ని డ్రెస్ లో భాగంగా అభ్యంతరకరంగా వాడరాదు. పతాకాన్ని అగౌరవ పరిచినట్లు తేలితే జైలు శిక్షలు కూడా అమలు పరిచే అవకాశముందని నిపుణులు అంటున్నారు. అయితే ఎన్ టిఆర్ బూట్లే జాతియ పతాకం రంగులతో ఉండడంపై ఈ విమర్శలు మొదలయ్యాయి.ఇక ఈ ఫోటోలను ప్రచురించిన పత్రిక నిర్వాహకులు తామకు ఆ సినిమా వారు అందచేసిందే తప్ప మరొకటి కాదని,తమను ఈ వివాదంలోకి లాగవద్దని అంటున్నారు.అయితే పత్రికపై ఫోటో అలా ఉన్నప్పటికీ, సినిమాలో దానిని ఉంచారా లేదన్నది మరి కొద్ది సేపట్లో తేలపోనున్నది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment