అందరూ ఎంతగానో ఎదురుచూసిన ‘శక్తి’ సినిమా విడుదలైంది. రికార్డులు బ్రేక్ చేసేస్తుందంటూ ఎంతో ప్రచారంతో రిలీజ్ అయిన సినిమా రిజల్ట్ ఏమిటనేది అందరికీ ఇప్పటికే అర్థమైపోయింది. ప్రచారం జరిగినంత విషయం సినిమాలో లేదని తేలిపోయింది. రికార్డులు క్రాస్ చేయడం మాట అటుంచి, అసలు పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయా? అన్నట్టుగా వుంది.
సినిమా రిజల్టును కాసేపు అలా ఉంచితే, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్టుగా ఈ సినిమా పేరు చెప్పి, రిలీజుకి ముందే ఇలియానా తన రేటుని పెంచేసుకుంది. అయితే, ఈ సినిమాలో తను విగ్రహ పుష్టి నైవేద్యనష్టి అన్నట్టుగా ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో జూ ఎన్టీఆర్ సరసన ఇలియానా నటించింది. తన నడుముతో అందరిని మైమరిపించే ఇలియానా ‘శక్తి’ చిత్రంలో మాత్రం మైనస్ మార్కులు వేయించుకుంటోంది.
జూ ఎన్టీఆర్ పక్కన ఇలియానా అంత సూట్ అవ్వలేదని, ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరలేదని జనాలు మాట్లాడుకుంటున్నారు. పైగా ఎన్టీఆర్ నటన ముందు ఇలియానా నటన వెలవెలబోయిందని, కేవలం ఎక్స్ పోజింగ్ మాత్రమే చేసిందని, నటన కనబర్చలేకపోయిందని పరిశీలకులు అంటున్నారు. ‘శక్తి’ సినిమాకి ఇలియానా ప్లస్ కాకపోగా..మైనస్ అయ్యిందని కూడా విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.కథానాయికకు ‘అందమొక్కటే కాదు, కాస్తంత నటన కూడా కావాలి తల్లీ’ అంటూ సినిమా చూసిన వాళ్ళు ఆమెకు చురకలేస్తున్నారు. ఆమె అడిగినంతా ఇస్తున్న నిర్మాతలు ఇప్పుడైనా ఒక్కసారి ‘డజ్ షి డిజర్వ్ ఇట్?’ అన్నది ఆలోచించుకోవాలి!
No comments:
Post a Comment