BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Friday, March 25, 2011

మళ్ళీ కలర్స్ స్వాతినే తీసుకున్న డైరక్టర్

Colors Swathiఅష్టాచెమ్మ చిత్రంతో పాపులరైన కలర్స్ స్వాతి ముచ్చటగా మూడో సారి ఇంద్రగంటి మోహన్ కృష్ణ చిత్రంలో బుక్కయింది. సుశాంత్ హీరోగా చేస్తున్న చిత్రంలో ఆమెనే మళ్ళీ తీసుకున్నాడు. అష్టాచెమ్మ,గోల్కొండ హైస్కూల్ చిత్రాల్లో ఆమెను తీసుకున్న మోహన్ కృష్ణ ఆమెను తన లక్ గా భావిస్తున్నాడని చెప్తున్నారు. అందుకే మరోసారి ఆమెనే తన ప్రాజెక్టులోకి తీసకున్నాడు. ఇక కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం..కలవరమాయే మదిలో, అప్లలరాజు,గోల్కొండ హైస్కూల్ అంటూ వరస ప్లాప్ ల్లో మునిగితేలుతున్న ఆమె మళ్ళీ ఈ చిత్రంతో మళ్ళీ నిలబడతానని భావిస్తోంది. ఇక ఈ చిత్రానికి "తొక్కుడు బిళ్ళ" అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

గోల్కొండ హైస్కూల్ కు ముందు రాసుకున్న కథతో ఇంద్రగంటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. గోల్కొండ హైస్కూల్ మంచి చిత్రమని పేరు తెచ్చుకున్నా ఆశించిన ఫలితం రాకపోవటంతో ఈ చిత్రాన్ని అష్టాచెమ్మ తరహాలో కామిడీ ఎంటర్టైనర్ గా మలిచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.ఇక ఈ చిత్రం గురించి సుశాంత్ తల్లి ఎ.నాగసుశీల మాట్లాడుతూ 'సుశాంత్ చేసిన రెండు సినిమాల్లో మంచి పెర్ ఫార్మర్ గా పేరు వచ్చింది. మేం స్టార్ట్ చెయ్యబోతున్న ఈ మూడో చిత్రం ద్వారా తప్పకుండా సుశాంత్ మరోసారి అందరి ప్రసంసలు అందుకుంటాడు. మా బ్యానర్ లో ఇది మరో మంచి సినిమా అవుతుందంటూ నమ్మకం వ్యక్తం చేసారు. ఈ చిత్రానికి నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగ సుశీల, కథ, స్క్రీన్-ప్లే, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

No comments:

Post a Comment