BREAKING NEWS
Friday, March 25, 2011
రాజమౌళి అసోసియేట్ తో...శ్రీకాంత్ చిత్రం
శ్రీకాంత్ తన పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేసిన సినిమాల్లో రెండు కొత్తదర్శకులతో చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో ఒకటి రాజమౌళి దగ్గర సహాయదర్శకుడిగా చేసిన రామకృష్ణా రెడ్డి (ఆర్.కె) దర్శకత్వంలో అని తెలుస్తోంది. స్టార్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దిలీప్, చంద్ర, శ్రీనివాస రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం, తెలుగులో ఇంతవరకూ రాని నేపధ్యంలో వస్తున్న ఒక హైస్పీడ్ యాక్షన్ థ్రిల్లర్ అని నిర్మాతలు తెలియపరిచారు. ఈ చిత్రంలో శ్రీకాంత హాలీవుడ్ చిత్రాల తరహా గెటప్ లో ఒక ప్రొఫెషనల్ కిల్లర్ గా తెలుస్తోంది. భిన్నమైన కథాంశంతోపాటూ ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లే తో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నామని దర్శకుడు చెప్తున్నాడు. మిగతా నటీనటులు మరియు సాంకేతిక వర్గం వివరాలు త్వరలో తెలుపుతామన్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ తోపాటూ మరొక ప్రత్యేకపాత్రలో మరొక హీరో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో రాజమౌళి శిష్యులు డైరక్టర్స్ గా పరిచయం అవుతూ.. కరుణాకర్ (ద్రోణ), జి.కె.కన్నన్(సారాయి వీర్రాజు) చిత్రాలు డైరక్ట్ చేసారు. అలాగే సునీల్ తో నెపోలియన్ చిత్రం తీస్తున్న కోటి కూడా రాజమౌళి శిష్యుడే.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment