BREAKING NEWS
Friday, March 25, 2011
జూ ఎన్టీఆర్, బోయపాటి శ్రీనుల కాంబినేషన్ టైటిల్?
బోయపాటి శ్రీను దర్శకత్వంలో జూ. ఎన్టీఆర్ చేయనున్న చిత్రానికి టైటిల్ గా 'దమ్ము'ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేసారు. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షయల్స్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. ఏప్రియల్ నుంచి ప్రారంభం కానున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా ఎంపికైంది. యాక్షన్ తో కూడిన పూర్తి స్ధాయి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించటానికి బోయపాటి ప్లాన్ చేస్తున్నారు. సింహా విజయం తర్వాత బోయపాటి చేస్తున్న చిత్రం ఇదే. అలాగే ఎన్టీఆర్ నటించిన శక్తి చిత్రం త్వరలో రిలీజ్ కావటానికి రెడీగా ఉంది. ఈ చిత్రం తో పాటు సురేంద్రరెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చిత్రం ప్రారంభం కానుంది. ఆ చిత్రానికి టైటిల్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. రచ్చ టైటిల్ అనుకున్నా అది ఇప్పుడు రామ్ చరణ్ చిత్రానికి పెడుతున్నాడు ఆ చిత్ర దర్శకుడు సంపత్ నంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment