హీరోయిన్లన్నాక అందాలను యధేచ్ఛగా ఆరబోయాలని, డబ్బు సంపాదనికి ఈ రంగంలోకి వచ్చాం కాబట్టి డబ్బులిచ్చిన వాళ్లు అడినట్టుగా అందాలు చూపించాలని ఇటీవలే ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో సిగ్గులేకుండా చెప్పింది. డబ్బులిస్తే దేనికైనా రెడీ అని నిస్సిగ్గుగా చెప్పిన ప్రియమణి చెప్పుతో బుద్దొచ్చేట్టు సమాధానం ఇచ్చింది రిచా గంగోపాధ్యాయ.
‘లీడర్’ సినిమాతో సరిచయమై ‘నాగవల్లి’, ‘మిరపకాయ్’ చిత్రాల్లో నటించిన రిచా ఇంతదాకా ఏ సినిమాలోనూ అదుపు దాటి అందాల ప్రదర్శన చేయలేదు. అసలు అలా చేయడం సబబు కాదని ఆమె అంటోంది. సినిమా పరిశ్రమ అంటే కేవలం డబ్బు సంపాదనకి మాత్రమే కాదని, ఇది కళ అని, కళని నమ్ముకున్న కళాకారులు డబ్బుకోసం అందాలు ఆరోబోయడం అంటే వ్యక్తిత్యాన్ని అమ్ముకోవడమేనని రిచా ఘాటుగా మాట్లాడింది ప్రియమణిలా డబ్బు పిచ్చితో ఉచ్ఛ నీచాలు మరిచిపోయిన వారికి రిచా మాటలు చెంపపెట్టు అని చెప్పాలి.
No comments:
Post a Comment