BREAKING NEWS
Sunday, February 6, 2011
జగన్‌ది జనాకర్షణే కాదు, పదవుల కోసమే చిరు దోస్తీ: రోజా
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేవలం జనాకర్షణ మాత్రమే కాదని జనాధరణ కూడా ఉందని జగన్ వర్గం నేత, ప్రముఖ సినీ నటి రోజా ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ప్రజారాజ్యం చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం దురదృష్టకరమన్నారు. అయితే ఎవరు ఎన్ని ఎత్తులు వేసిన జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేరని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను కేవలం జగన్ ఒక్కరే ముందుకు తీసుకు వెళతారని ప్రజలు భావిస్తున్నారన్నారు. జగన్‌ను అడ్డుకోవడం ఎవరి తరమూ కాదన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment