మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై వ్యవసాయ శాఖమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పోటీ చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి బలం చేకూర్చే విధంగా నర్రెడ్డి కూడా జగన్‌పై పోటీకి తాను సిద్ధమని ప్రకటించారు. అయితే అధిష్టానం నుండి ఆదేశాలు రావాలని చెప్పారు. అధిష్టానం అదేశిస్తే పోటీ చేస్తానని చెప్పారు. ఆయన నియోజకవర్గంలో కూడా పర్యటిస్తున్నట్లుగా చెప్పారు. అధిష్టానం నర్రెడ్డిని ఎప్పుడో ఖరారు చేసినందునే ఆయన తెరముందుకు వస్తున్నట్టుగా తెలుస్తోంది.
అయితే అధికారికంగా మాత్రం ఇంకా ఎవరినీ ప్రకటించలేదు. జగన్ అసెంబ్లీకి పోటీ చేయనని చెప్పినందున, నర్రెడ్డి కూడా జగన్‌పై పోటీకి సిద్ధమని చెప్పిన కారణంగా ఎంపీగా పోటీ చేయడానికి నర్రెడ్డి ఉత్సాహ పడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా నర్రెడ్డి నియోజకవర్గాల్లో తిరుగుతూ తాను వైఎస్ కుటుంబ సభ్యుడినే అని చెబుతున్నట్టుగా కనిపిస్తోంది.
కడప ఎంపికి జగన్‌తో నర్రెడ్డి పోటీ చేస్తుండగా, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ విజయమ్మను జగన్ దించే అవకాశాలు ఉన్నాయి. ఆమెపై మరిది వైఎస్ వివేకానందరెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఉన్న ఇమేజ్ కారణంగా అదే కుటుంబానికి చెందిన వివేకానందను అభ్యర్థిగా దించడానికే ఇటు ముఖ్యమంత్రి కిరణ్‌గానీ, అటు అధిష్టానం గానీ మొగ్గు చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంతకుముందు రాష్ట్ర రాజకీయాలను వైఎస్ చూసుకునేవారని, వివేకానంద కడప జిల్లాకు పరిమితం అయ్యేవాడని తెలుస్తోంది. జిల్లాలో వివేకాకు ఉన్న పరిచయాల నేపథ్యంలో కూడా ఆయననే పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీతో పాటు, వివేకా కూడా పోటీకి సిద్ధంగా ఉన్నారు.
No comments:
Post a Comment