ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Sunday, February 6, 2011
రాజీనామా ఆఖరి అస్త్రం, 14న ఢిల్లీకి వెళతాం: తెలంగాణ ఎమ్మెల్యేలు
రాజీనామా ఆఖరి అస్త్రం, 14న ఢిల్లీకి వెళతాం: తెలంగాణ ఎమ్మెల్యేలు
హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆఖరి అస్త్రంగా మాత్రమే రాజీనామాలు ప్రయోగిస్తామని తెలంగాణ కాంగ్రెస్
కేంద్రం నుండి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం రాకుంటే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతామని చెప్పారు. తెలంగాణ కోసం అన్ని పార్టీలు పార్టీ ఎజెండా పక్కన పెట్టి తెలంగాణ కోసం పోరాటం చేయాల్సి ఉంటుందన్నారు. అన్ని పార్టీలలోని తెలంగాణవాదులు ఇందుకోసం కలిసి రావాలన్నారు. శాసనసభ్యులు ఆదివారం స్పష్టం చేశారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులం తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. తెలంగాణ కోసం కేవలం పదవులే కాదు. ఎలాంటి త్యాగాలకైనా మేము సిద్ధమని ప్రకటించారు. పార్లమెంటులో బిల్లు పెట్టే వరకు పోరాడుతామని చెప్పారు. తెలంగాణకోసం 14వ తారీఖున న్యూఢిల్లీ వెళ్లనున్నట్లు చెప్పారు. ఆదివారం తెలంగాణ ఎమ్మెల్యేల సమావేశం అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.
No comments:
Post a Comment