ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Sunday, February 6, 2011
వేదం హీరోయిన్ తో మంచు మనోజ్ కొత్త చిత్రం
వేదం హీరోయిన్ తో మంచు మనోజ్ కొత్త చిత్రం
వేదం చిత్రంతో పరిచయమైన దీక్షాసేధ్ ...మిరపకాయ,వాంటెడ్ అంటూ వరస ఆఫర్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె వేదంలో నటించిన సహ నటుడు మంచు మనోజ్ తో చిత్రం కమిటైంది. మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తున్న 'వూ... కొడతారా... ఉలిక్కిపడతారా' చిత్రం కోసం ఆమెను తీసుకున్నారు. ఈ చిత్రం ద్వారా రాజా అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు.
షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ఇక మంచు లక్ష్మీ 'ఝుమ్మంది నాదం' తరవాత నిర్మించే చిత్రం ఇది. ఈ చిత్రం కామిక్ ధ్రిల్లర్ గా ఉంటుందని చెప్తున్నారు. ఈ చిత్రం గురించి మంచు మనోజ్ మాట్లాడుతూ.....సినిమా అంతా ఉలిక్కిపడేలాగే ఉంటుంది. ఈ నా డ్రీమ్ ప్రాజెక్ట్ కృష్ణవంశీ శిష్యుడైన రాజాను దర్శకునిగా పరిచయం చేస్తూ ఉంటుంది. అలాగే ఆ చిత్రం కచ్చితంగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందే ప్రమాణాలతో ఆ చిత్రం ఉంటుంది అంటున్నారు. అలాగే కామెడీ చిత్రాల్లో సరికొత్త ప్రయోగంలా ఈ చిత్రం వుంటుంది అని అంటున్నారు.
No comments:
Post a Comment