ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Sunday, February 6, 2011
అదే చేస్తూంటే నాక్కూడా విసుగొస్తుంది...కాజల్
అదే చేస్తూంటే నాక్కూడా విసుగొస్తుంది...కాజల్
ఎప్పుడూ ఒకేలా కనిపిస్తే చూసేవాళ్లకే కాదు... నాక్కూడా విసుగొస్తుంది. అందుకే పాత్రల్లో కొత్తదనం కోసం అన్వేషిస్తున్నా. ఒకవేళ కొత్త కథలు, విభిన్న పాత్రలు రాకపోతే కనీసం మేకప్ లో అయినా ఆ మార్పు చూపించాలి అంటూ చెప్తోంది కాజల్.. అని చెప్పుకొచ్చింది. సినిమా సినిమాకీ నాలో మార్పులు కనిపిస్తున్నాయి. అంతకు ముందు సినిమాలకంటే 'డార్లింగ్'లో బాగున్నాను.
'బృందావనం'లో ఇంకొంచెం మారాను. ఇప్పుడు 'మిస్టర్ పర్‌ఫెక్ట్'లో కూడా ఆ మార్పు మీకు స్పష్టంగా కనిపిస్తుంది.అలాగే ... సినిమా అంటే ఇరవై నాలుగు విభాగాల కృషి. ఏ ఒక్కరి వలనో సినిమా ఆడదు. విజయంలో, పరాజయంలో అందరికీ భాగం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక త్వరలో కాజల్...కబడ్డి చిట్టిగా ఫుల్ లెంగ్త్ మాస్ పాత్రలో కనిపించనుంది. రవితేజ హీరోగా చేసే వీర చిత్రం కోసం ఆమె తొలిసారిగా ఫుల్ లెంగ్త్ మాస్ పాత్రను పోషిస్తోంది. ఈ వేసవి కి ఈ చిత్రం రిలీజ్ కానుంది.
No comments:
Post a Comment