ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Thursday, January 13, 2011
అల్లరి నరేష్ ఆ ఒక్క అబద్దం ఆడే సమస్యలో పడ్డాడు
అల్లరి నరేష్ ఆ ఒక్క అబద్దం ఆడే సమస్యలో పడ్డాడు.
వంద అబద్ధాలు ఆడైనా సరే ఓ పెళ్లి చేయాలి అంటారు పెద్దలు. మా హీరో అల్లరి నరేష్ పెళ్ళి కోసం ఒకే ఒక్క అబద్ధం ఆడాడు. అక్కడి నుంచే సమస్య మొదలౌతుంది అంటున్నారు దర్శకుడుగా పరిచయం అవుతున్న వీరభధ్ర చౌదరి.ఆయన తాజా చిత్రం 'అహ నా పెళ్లంట'. 'మ్యాచ్ ఫిక్సింగ్' అనేది ట్యాగ్ లైన్.వచ్చేనెలలో రిలీజుకు ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం ఆడియో ఈనెల 14న పాటల్ని విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. ఇక చిత్రంలో తన పాత్ర గురించి మాట్లాడుతూ...ఓటు వేసే వయసు దాటేసి పుష్కరం అయినా నాకుపెళ్లి కాలేదు. నచ్చిన పిల్ల దొరక్క కాదు. ఉద్యోగం లేకా కాదు.అప్పటికీ అందాల భరిణె లాంటి అమ్మాయి నా ప్రేమకి పచ్చజెండా వూపేసింది. ఆర్థిక మాంద్యం దెబ్బకి తట్టుకొన్న ఓ ఐటీ కంపెనీలో ఎప్పటికీ వూడిపోని ఉద్యోగం ఉంది. మరి సమస్య ఏమిటి? అదే మా సినిమాలోని అసలు కథ అంటున్నారు నరేష్. అలాగే ఈ చిత్రం ద్వారా రీతూ అనే హీరోయిన్ పరిచయం అవుతోంది. ఇక ఈ అహనా పెళ్ళంట టైటిల్ గతంలో రాజేంద్రప్రసాద్ తో జంధ్యాల సృష్టించిన అధ్బుతమైన కామిడీకి పెట్టారన్న సంగతి తెలిసిందే.అలాగే ఈ చిత్రానికి సంగీతం...రఘు కుంచె అందిస్తున్నారు.
No comments:
Post a Comment