BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Thursday, January 13, 2011

స్టార్ డైరక్టర్ నుంచి "కొమరం పులి" హీరోయిన్ కి పిలుపు

స్టార్ డైరక్టర్ నుంచి "కొమరం పులి" హీరోయిన్ కి పిలుపు..






Nikisha Patel పవన్ కళ్యాణ్ సరసన 'కొమరంపులి' చిత్రంలో చేసిన నికిషపటేల్‌ కి ఆ తర్వాత ఆఫర్స్ ఏమీ రాలేదు.చిన్న చితకా చిత్రాల నుంచి ఆపర్స్ వచ్చినా ఆమె రిజెక్ట్ చేసింది. ఈ నేపధ్యంలో ఆమెకు బాలీవుడ్ స్టార్ డైరక్టర్ సుభాష్ ఘయ్ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఆమె చేయబోయే పాత్ర గురించి ఘాయ్‌ నికిషకి చెప్పేశారు. నికిష తనకు లభించిన అవకాశాన్ని అంది పుచ్చుకుంది. కేవలం గ్లామర్‌కు మాత్రమే కాకుండా కథకి, క్యారక్టర్‌కి ప్రాధాన్యత నిస్తానని నికిష చెబుతోంది. అందువల్లే ఇతర భాషా చిత్రాల నుండి అవకాశాలు వచ్చిన అంగీకరించలేదని చెప్తోంది. ఇక కొమురం పులి చిత్రం చేసిన తర్వాత నిఖిష ఓ లీడింగ్ న్యూస్ పేపరుతో తన గోడు వెళ్ళబోసుకుంది. పులి ప్లాపుతో నేనే నాశనమయ్యాను..పవన్ బాగానే ఉన్నారు..ఆయన ఇంకో సినిమాలో అప్పుడే బిజీ అయ్యారు. ఎస్.జె.సూర్య..దర్శకుడుగా కంటిన్యూ అవుతున్నారు. ఎటొచ్చీ నా రెండున్నరేళ్ళ కెరీర్ పాడయింది. ఈ సినిమా సంతకం పెట్టేడప్పుడు ఈ చిత్రం రిలీజయితే చాలా ఆఫర్స్ వస్తాయనుకున్నాను. షూటింగ్ లో ఉండగా చాలామంది ఫిల్మ్ మేకర్స్ నన్ను తమ కొత్త చిత్రాల కోసం సైన్ చేయమని అడిగారు.అయితే రిలీజయ్యే వరకూ వేరే చిత్రం ఒప్పుకోవద్దని ఈ పులి చిత్రం వారు చెప్పారు. ఇప్పుడు సినిమా చూస్తే ఇలా దారుణంగా ఫెయిలైంది అంది.

No comments:

Post a Comment