ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Thursday, January 13, 2011
తమన్నా రైలు ఎక్కకపోతే...అతనికి ఆత్మహత్యే గతి
తమన్నా రైలు ఎక్కకపోతే...అతనికి ఆత్మహత్యే గతి..!
ఎటుచూసినా కష్టాలు..భాధలు..ఈ పరిస్దితుల్లో మరణమే మేలు అనుకుని అతను ఫిక్సై వైజాగ్ రైలు ఎక్కాడు. రైలు కదిలాక ఆత్మ హత్య చేసుకుందాముకుందామనుకున్నాక...కదులుతున్న ఆ రైల్లోకి అందాల అమ్మాయి తమన్నా ఎక్కింది. ముఖం నిండా నవ్వు..చక్కటి కనుముక్కు తీరుతూ లొడ లొడ మాట్లాడుతూంటే ఆమె..ఈ కుర్రాడికి తనకు తాను పరిచయం చేసుకుంది. అక్కడ్నుంచీ ఆ కుర్రాడి జీవితం పూర్తిగా మారిపోయింది.అయితే ఇదంతా నిజ జీవిత కథ కాదు. తమన్నా హీరోయిన్ గా చేసిన ప్రియా...ప్రియతమా...చిత్రంలోని పాయింట్ ఇది. ప్రేమిస్తే ఫేం భరత్, తమన్నా జంటగా తమిళంలో రూపొందిన కండేన్ కాదలై చిత్రం తెలుగు లో ఈ టైటిల్ తో డబ్బింగ్ అవుతోంది. ఆర్.కన్నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా...అక్కడ యావరేజ్ గా ఆడింది. మోసర్ బేర్ ఎంటర్ టైన్ మెంట్ లిమిటెడ్ వారు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రం బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ జబ్ వి మెట్ చిత్ర కి రీమేక్. ఇక ప్రస్తుతం తమన్నా..నాగచైతన్య సరసన ఐలవ్ యు అనే చిత్రంలోనూ, అల్లు అర్జున్ సరసన బద్రీనాధ్ చిత్రంలోనూ చేస్తోంది. అలాగే ఎన్టీఆర్ , సురేంద్రరెడ్డి కాంబినేషన్ లో రూపొందనున్న రచ్చ చిత్రంలోనూ ఎంపికైంది.
No comments:
Post a Comment