ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Thursday, January 13, 2011
హాట్ సీన్స్ కి సెన్సార్ కట్స్ అంటూ పబ్లిసిటీ బాగానే ఇచ్చుకొంటున్నాడు....
హాట్ సీన్స్ కి సెన్సార్ కట్స్ అంటూ పబ్లిసిటీ బాగానే ఇచ్చుకొంటున్నాడు....
షాక్’ సినిమాతో రవితేజ కి షాకిచ్చిన దర్శకుడు హరీష్ శంకర్, ఈసారి మాత్రం ‘మిరపకాయ్’ అంటూ ఘాటైన హిట్టిస్తానంటున్నాడు. ‘మిరపకాయ్’ పక్కా కమర్షియల్ సినిమా..రొమాన్స్..యాక్షన్..ఎంటర్ టైన్ మెంట్..ఇవన్నీసమానంగా మిక్స్ అయి వుంటాయంటోన్న హరీష్ శంకర్, తనను నమ్మినందకు రవితేజకు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టివ్వాలనే ప్రయత్నంతో సినిమాని మరింత జాగ్రత్తగా తెరకెక్కించానని చెప్పుకొచ్చాడు. ఇక, ఈ సినిమాలో రొమాన్స్ కాస్త ఎక్కువయ్యిందనీ, సెన్సార్ కట్స్ బాగానే పడ్డాయని గుసగుసలు విన్సిస్తుండడంపై స్పందించిన హరీష్ శంకర్, సినిమాలో ఎక్కడ కట్స్ పడ్డాయో తనకు చెప్పాలంటూ సరికొత్త ప్రచారానికి తెరలేపాడు.
సీరియస్ గా అన్నాడో?సరదాగా అన్నాడో గానీ, ఓ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రొమోస్ లో రిచాగంగోపాద్యాయ-రవితేజ రొమాన్స్ ఘాటు..వెరసి సినిమా పబ్లిసిటికీ బాగానే హెల్సవుతోంది. కాగా సెన్సార్ కట్స్ రిచా-రవితేజ రొమాన్స్ పైనా..?యాక్షన్ సన్నివేశాలపైనా..?డైలాగులపైనా..?అనేది రివ్వూ వచ్చేదాకా వేచి చూడాల్సిందే.
No comments:
Post a Comment