రాజమండ్రి: విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సి ఓ ఉపాధ్యాయుడు తన వద్ద చదువుతున్న ఓ విద్యార్థిని తల్లి వద్ద ప్రేమ పేరుతో వెలికి వేషాలు వేయడంతో కటకటాల పాలయ్యాడు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పరిసరాల్లోని కడియం పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినితో పాటు వచ్చిన ఆమె తల్లిని చూశాడు. ఆమె పట్ల ఆకర్షితుడైన సదరు ఉపాధ్యాయుడు తన సెల్ ఫోన్ నెంబరు విద్యార్థినికి ఇచ్చి తల్లికి ఇవ్వమని చెప్పాడు. ఏమీ తెలియని ఆ విద్యార్థిని సెల్ నెంబరు తల్లికి ఇచ్చింది. తన కూతురు చదవు విషయమై ఏమైనా మాట్లాడుతారేమోనని భావించిన ఆ తల్లి ఉపాధ్యాయుడికి ఫోన్ చేసింది.
అయితే తాను బిజీగా ఉన్నానని రాత్రి పది గంటలకు ఫోన్ చేస్తానని చెప్పాడు. దాంతో ఆమె మిన్నకుండిపోయింది. అన్నట్టుగానే పది గంటలకు ఫోన్ చేశాడు. నువ్వంటే నాకిష్టం అని చెప్పాడు. అటునుండి పాజిటివ్ రిజల్ట్ వస్తుందని భావించాడు. కానీ ఆ తల్లి నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని ఉపాధ్యాయుడు నమ్మబలుకుతున్నాడు.