పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్ లో దిల్ రాజు సీతమ్మవారి వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే టైటిల్ తో ఓ మల్టి స్టారర్ ఫిలిం రాబోతోందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఆ చిత్రంలో చేయనని తప్పుకున్నారని,దాంతో మహేష్ ని సంప్రదించారని,ఆయన వెంటనే ఓకే చేసారని వినపడుతోంది.అంతేగాక అక్టోబర్ ఆరవ తేదీ నుంచి షూటింగ్ అని కూడా డేట్ చెప్తున్నారు.అయితే ఈ విషయాన్ని చాలా మంది నమ్మటం లేదు.మహేష్ బాబు సినిమా ఇవ్వాలంటే సవాలక్ష కండీషన్స్ ఉంటాయని,అందులోనూ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో అంటే డేట్స్ ఇస్తాడా అని సందేహం వెళ్ళబుచ్చుతున్నారు.ప్రస్తుతం మహేష్ ..దూకుడు చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.అంతకుముందు కమిటయిన మణిరత్నం,శంకర్ చిత్రాలలో చేయటం లేదు
Source:news.oneindia.in
Source:news.oneindia.in
No comments:
Post a Comment