జగన్ ప్రభావం ఏమీ లేదని, ఆయనకు బలం లేదని ఇప్పుడు తేలిపోయిందన్నారు. టిడిపికి ఓటు వేయలేకే జగన్ వర్గం కాంగ్రెస్‌కు ఓటేసిందన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ జగన్ వర్గ ఎమ్మెల్యేలు ఓటు వేసినా, వేయకపోయినా ఒరిగేదీ తరిగేదీ ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేసేందుకు ఏ అవకాశాలున్నా, తాను నియోగించుకుంటానని, ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్‌ను పటిష్ఠం చేయడంలో తన పాత్రపై చర్చ జరిగిందని, ఆ పాత్ర ఏమిటనేది అధిష్ఠానమే ప్రకటిస్తుందని ఆజాద్‌తో భేటీ అనంతరం చిరంజీవి అన్నారు. భవిష్యత్తులో ఎన్నో బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుందని ఆజాద్ తనకు చెప్పారని తెలిపారు.
పార్టీలో తన పాత్ర ఏమిటనేది అధిష్ఠానమే ప్రకటిస్తుందన్నారు. పీసీసీ అధ్యక్షుడిని పది రోజుల్లోపలే నియమిస్తామని ఆజాద్ చెప్పారని చిరు తెలిపారు. ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులకు మంత్రివర్గంలో చోటు, తన పదవులపై చర్చించేందుకు వచ్చానని మీడియాలో చెప్పడం సరికాదన్నారు
Source:news.oneindia.in
No comments:
Post a Comment